అన్నమయ్య: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో పాడేరులో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ధీరజ్ కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విద్యాసాగర్ నాయుడిని కృష్ణా జిల్లాకు బదిలీ చేశారు. జిల్లా ఎస్పీగా పనిచేసిన కాలంలో అనేక సంచలనాత్మక హత్య, దోపిడీ కేసులను ఛేదించి గుర్తింపు పొందారు.