SKLM: జిల్లాలో ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్గా వి. రామారావు బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు శనివారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా పోలీసు స్టేషన్కు సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులు పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు.