ADB: ఇంద్రవెల్లి మండలంలోని జాలంతాండ గ్రామంలో ఎంపీ నగేశ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంపీ నగేశ్ కు భాజ భాజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జాలంతాండ గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పేర్కొన్నారు.