E.G: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15న సోమవారం యధాతధంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా meekosam.ap.gov.in వెబ్ సైట్లో తెలియజేయాలని కోరారు.