KDP: జిల్లా చెన్నూరు మండలం భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొండపేట గ్రామానికి చెందిన గోవిందు గణేష్ నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తాను మండల ఉపాధ్యక్షుడిగా ప్రజల సమస్యలపై పోరాటం చేశానని, ఇకపై ప్రతి గ్రామాన్ని పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.