SKLM: పెండింగ్లో ఉన్న పనులను త్వరగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ఆదేశించారు. శనివారం ఆమదాలవలస పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఇరిగేషన్, వంశధార అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రణాళిక బద్దంగా పంటల సాగుకు అవసరమైన నీటి వినియోగం కాలువలు, చెరువులు పూడికల తీతలు తీయించాలన్నారు.