ASF: సిర్పూర్ (U)మండలం కోహినూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను MLA కోవ లక్ష్మి శనివారం సందర్శించారు. పాఠశాల విద్యార్థుల బాగోగులు, వసతుల గురించి పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం, ఎదుర్కొంటున్న సమస్యలు, తరగతి గదుల సౌకర్యాలు, భోజన వసతి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా MLA తో పంచుకున్నారు.