MNCL: చెన్నూర్ బస్టాండ్ అపరిశుభ్రంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, ఏరియా కార్యదర్శి బోడంకి చందు తెలిపారు. శనివారం వారు బస్టాండ్‌ను సందర్శించి సమస్యలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బస్టాండ్ పరిసరాల్లో చెత్తాచెదారం, మురికి కుంటలతో కంపు కొడుతున్నాయని అన్నారు.