NLR: దగదర్తి మండలంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుపడకుండా సహకరించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి మాలేపాటి సోదరులకు పిలుపునిచ్చారు. శనివారం మనుబోలుపాడులోని వారి నివాసంలో జరిగిన విలేఖరుల సమావేశంలో రవికుమార్ చౌదరి మాట్లాడారు. గత వారం రోజులుగా డీఆర్ ఛానల్ పనులపై మాలేపాటి సోదరులు చేస్తున్న ఆరోపణలపై స్పష్టతనిచ్చారు.