ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా అబుదాబి వేదికగా మరికాసేపట్లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇప్పటికే విజయం సాధించిన బంగ్లాదేశ్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. అదే సమయంలో టోర్నీలో బంగ్లాను ఓడించి బోణీ కొట్టాలని శ్రీలంక ఉవ్విళ్లూరుతోంది.