KMR: ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మాల్తుమ్మెద శివారులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.