ADB: జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా శ్రీకర్ గౌడ్ నియామకమయ్యారు. శనివారం హైదరాబాదులోని గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. యువ నాయకులు శాంతన్, సాయిచరణ్ గౌడ్, పోతారెడ్డి తదితరులు ఉన్నారు.