NZB: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి బీజేపీదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం సేవా పక్వాడ కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్వే ప్రకారం వారికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.