WNP:పెద్దగూడెంలోని మహాత్మా జ్యోతిరావుపూలే వ్యవసాయ మహిళ డిగ్రీ కాలేజ్ విద్యార్థినిలతో కలిసి శనివారం అదనపు కలెక్టర్ కిమ్యానాయక్ భోజనం చేశారు. నాణ్యత గురించి ఆయన స్టూడెంట్స్ను అడిగి తెలుసుకున్నారు. వంట చేసేముందు చేతులు శుభ్రం చేసుకోవాలని, వైడల్ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. వంటలు చేసే వారికి అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ ప్రశాంతిని ఆయన ఆదేశించారు.