VZM: గజపతినగరం కోర్టులో శనివారం న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 585 కేసులు పరిష్కారం జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షిదారులు అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటే సమయం డబ్బు ఆదా అవుతుందన్నారు. రాజీయే రాజమార్గమని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.