SKLM: ఆమదాలవలస మండలం కలివరంలో సీసీ రోడ్డు కోతకు గురి కావడంతో నదీ తీర నివాసితులు భయాందోళన చెందుతున్నారు. వర్షం పడే సమయంలో గ్రామంలోని వర్షపు నీరంతా నాగావళి నదిలోకి జారుతున్న సమయంలో నదీతీరం కోతకి గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనివలన నది తీరం వద్ద నివసిస్తున్న ఇళ్లకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.