ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనను శనివారం బద్వేలు నుంచి భాష్యం హై స్కూల్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ ముప్పాళ్ళ శ్యామ్ సుందర్ రాజు, ఆలయ అర్చకులు విద్యార్థులక భైరవకోన యొక్క చరిత్రను వివరించారు. అనంతరం ప్రముఖ దుర్గాంబా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.