VSP: సీతమ్మధారలో గల లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రిలో 9 -14 ఏళ్ల బాలికల కోసం ఇవాళ ఏర్పాటు చేసిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణ ఉచిత వ్యాక్సినేషన్ శిబిరానికి విశేష స్పందన లభించింది. తొలిరోజునే 300 మందికి పైగా బాలికలకు టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 670 మంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.