MNCL: కోటపల్లి మండలంలోని ఆలుగామా గ్రామంలో చదువుల తల్లి సరస్వతీ దేవి విగ్రహాల ఏర్పాటుకు మాజీ సర్పంచ్ మారిశెట్టి వెంకటస్వామి ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం గ్రామంలో మూడు సరస్వతీ దేవి విగ్రహాల ఏర్పాటుకు రూ.15 వేలు చొప్పున అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువులో ముందుండాలని సూచించారు.