NLG: పీడిత ప్రజల కోసం ఆనాడు చేసిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుల త్యాగాల వృధా కానీవ్వమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కన్నెకంటి రంగయ్యా అంతిమయాత్ర శనివారం మిర్యాలగూడ మండలంలోని యాద్గిరిపల్లి గ్రామంలో నిర్వహించారు.