అన్నమయ్య: మదనపల్లె జిల్లా ప్రకటన పై ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలని జిల్లా సాధన సభ్యులు డిమాండ్ చేశారు. ఇవాళ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మంత్రివర్గ ఉప సంఘం ఒక్కసారి కూడా అధికారికంగా పర్యటించలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మదనపల్లెను జిల్లాగా పరకటిస్తామని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు.