TG: బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మోదీని KTR, హరీశ్ రావు కలిశారని.. అయితే వాళ్లు కూడా బీజేపీలో చేరినట్లా? అని ప్రశ్నించారు. BJPలో చేరినట్లు వాళ్లకు కూడా నోటీసులు పంపిస్తామని పేర్కొన్నారు. KCR కుటుంబం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని విమర్శించారు.