ప్రకాశం: వెలిగండ్ల మండల పరిధిలోని గన్నవరం గ్రామంలో ఇటీవల నిర్మించిన బ్రిడ్జిని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. వేగవంతంగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలోనే బ్రిడ్జిని మంత్రి అచ్చం నాయుడు చేతుల మీదగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.