W.G: శ్రీ గణేష్ నవరాత్రులలో భాగంగా 32 రకాల పిండి వంటకాలతో శనివారం ఆకివీడు మండలం గుమ్ములూరులో భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో రామాలయం యూత్ ఆధ్వర్యంలో 73 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.