ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సాధారణ వ్యక్తిలా పెట్రోల్ బంక్లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు. శనివారం ఎమ్మెల్యే బొజ్జు ఉట్నూర్ మండల కేంద్రంలోని స్థానిక పెట్రోల్ బంక్లో ఎటువంటి ఆర్భాటం లేకుండా, ప్రత్యేక వాహనాల కాన్వాయ్ లేకుండా, తన స్కూటీలో పెట్రోల్ కోసం క్యూలో నిలబడి పెట్రోల్ పోయించుకున్నారు. ఆయనను చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు.