W.G: కాళ్ళకూరులో స్వయంభూ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి 20 వరకు సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎం.అరుణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఆలయ అర్చకులతో కలిసి పవిత్రోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. 20న (శనివారం) ఏడు పుణ్య నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తామని ఆయన తెలిపారు.