స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత మిజోరం రాజధాని ఐజాల్ ప్రజల కల నెరవేరింది. ఇప్పటి వరకు మిజోరం బైరాబి వరకు మాత్రమే ఉన్న రైల్వే లైన్ను తాజాగా బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ద్వారా ఐజాల్ వరకు కేంద్రం పొడిగించింది. దీంతో మిజోరం ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత సులభతరం కానున్నాయి. ఇవాళ ప్రధాని మోదీ తన చేతుల మీదుగా ఈ రైలు కనెక్టవిటీని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.