VSP:వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కె. శ్రీనివాస్ ఇవాళ తెలిపారు. ఈ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.