KDP: వేంపల్లిలో పారిశుద్ధ్యం దయనీయ స్థితిలో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇవాళ పంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో కాలువలు మురుగుతో నిండిపోవడం, దోమల పెరుగుదల అధికమవడంతో ప్రజలు విషజ్వరాలు వస్తున్నాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.