VSP: నృత్యాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘ సేవకులు కమల్ బేయిడ్ అన్నారు. సీతమ్మధారలోని ఏపీఎస్ఈబీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశ మందిరంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ , ప్రజాపిత బ్రహ్మకుమారీస్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే జిల్లాస్థాయి నృత్య పోటీలను ఇవాళ ఆయన ప్రారంభించారు.