W.G: ఏపీఐసీసీ ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు పెద అమిరంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఆక్వా ఎక్స్పో ఇండియాను శనివారం సందర్శించారు. ఆక్వా రైతుల సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఎక్స్పోలో పలు స్టాల్స్ పరిశీలించి, రొయ్యలు, చేపల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇటువంటి ఆక్వా ఎక్స్పోలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.