KRNL: ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి అంగన్వాడీ కేంద్రం-1లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టును బీసీ (డి)కి బదులుగా రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ గ్రూప్-2కు కేటాయించామని ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో సఫరున్నీసా బేగం తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. పైన తెలిపిన ఆయా పోస్ట్ రిజర్వేషన్ను గమనించాలన్నారు.