SKLM: పలాస మండలం కేసుపురం గ్రామంలో చేతబడి నెపంతో ఉంగ రాము హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుడి కుటుంబాన్ని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, పౌర హక్కుల సంఘం, దేశభక్త ప్రజా తంత్ర ఉద్యమం కార్యకర్తలు నిజ నిర్ధారణ కోసం శనివారం సందర్శించారు. నేటి ఆధునిక సమాజంలో మానవుడు గ్రహాలను అన్వేషిస్తున్న తరుణంలో ఒక దాసుడు చెప్పిన మాటలు విని వ్యక్తిని చంపడం దారుణం అన్నారు.