ADB: ప్రభుత్వాధికారులు అపరిచితులకు నేరస్తులకు షూరిటీ పెట్టేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ షూరిటీలను ఉపయోగించి లబ్ధి పొందిన, బ్రోకరిజం చేసిన 17 మందిపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.