MBNR: పోగొట్టుకున్న ఫోన్ను పోలీసులు బాధితుడికి అందజేశారు. మిడ్జిల్ మండలం రాణిపేటకు చెందిన కర్నెకోట మధు వ్యక్తిగత పనుల నిమిత్తం అయ్యవారిపల్లి రోడ్డు సైడ్ వెళ్లగా ఫోన్ పోయింది. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు సూచన మేరకు హెడ్ కానిస్టేబుల్ నారాయణరెడ్డి, టెక్ టీం కానిస్టేబుల్ రవికుమార్ సహకారంతో ఫోన్ రికవరీ చేసి, అతనికి అందజేశారు.