VSP: భీమిలి మండలం దాకమర్రి గ్రామంలో సర్పంచ్ చెల్లూరు పైడప్పడు ఆధ్వర్యంలో ఓ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. సుమారు 50 మందికి కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెల్లూరు నగేష్ బాబు, ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం జోనల్ ప్రధాన కార్యదర్శి గెద్ద చిరంజీవి పాల్గొన్నారు.