W.G: ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల బారిన పడి మోసపోతున్నారని భీమవరం ఆర్టీసీ ఇంఛార్జ్ మేనేజర్ వై.సురేశ్ అన్నారు. ఈగల్ సెల్ ఆధ్వర్యంలో భీమవరం కొత్త బస్టాండ్లో ప్రయాణికులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తిగత సమాచారాన్ని, ఓటీపీలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వకూడదని, అలాగే తెలియని యాప్లను ఇన్స్టాల్ చేసుకోకూడదని సూచించారు.