NLR: వింజమూరు మండలం ఊటుకూరు వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు గవ్వల మల్లికార్జున తన అనుచరులతో కలిసి శనివారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీటీసీ మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికల్లో తన వంతు కృషి చేసి కూటమి ప్రభుత్వ విజయానికి దోహదపడతానని తెలిపారు.