NTR: దసరా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను శనివారం దేవస్థానం అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తే ఇంజనీరింగ్ అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు.