ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని సోనాపూర్ అబ్బాపూర్ సమీపంలో శనివారం పులి అడుగులను గుర్తించినట్లు స్థానిక రైతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ పనులకు వెళ్తుండగా పులి అడుగులను చూసినట్లు చెప్పారు. కాగా, అవి పులి అడుగులో కాదో అని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించాల్సి ఉంది.