TG: గ్రూప్-1పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 వేల ఉద్యోగాలు ఇచ్చి.. 2 లక్షల ఉద్యోగాలని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్.. జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిందన్నారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందంటూ మండిపడ్డారు.