NLG: జిల్లా పోలీస్ కార్యాలయంలో AR DSP, RI, RSIల క్వాటర్స్, శిశు విహార్ భవనాలను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6.65 కోట్ల వ్యయంతో ఈ సదుపాయాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మించింది. మహిళా సిబ్బందికి శిశు సంరక్షణ కోసం ప్రత్యేక శిశువిహార్ ఏర్పాటు చేశారు.