ATP: సింగనమల మండలం వెస్ట్ నరసాపురం గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో వర్షపు నీరు వృధా కాకుండా చెక్ డ్యామ్ నిర్మించి నీరు నిల్వ ఉంచడంతో గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుంటలు, చెరువులు వర్షపు నీటితో పొంగి పారుతున్నాయన్నారు. చెక్ డ్యామ్ నిర్మించిన ఎమ్మెల్యే బండారు శ్రావణికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.