ఓటరు సర్వేపై నిరంతర ఆదేశాలు ఇవ్వడం తమ అధికార పరిధిని అతిక్రమించడమేనని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు జాబితాలను సవరించడం, ఎన్నికల ప్రక్రియను చేపట్టడం వంటి ప్రత్యేక అధికారాలు రాజ్యాంగం ప్రకారం తమకు ఉన్నాయని ఈసీ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఓటరు సర్వే చేపట్టాలంటూ కోర్టు ఇచ్చే ఆదేశాలు తమ అధికారాలను అతిక్రమించడమేనని ఈసీ అభిప్రాయపడింది.