E.G: ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకోవడంలో అధికారుల నుంచి స్పష్టమైన వైఖరి అవసరమని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ప్రతి శాఖలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు, దరఖాస్తులు, కేసులను సమగ్రంగా పరిశీలించి, తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. సమస్యలను సగటు దృష్టితో కాకుండా, మూల కారణాలను గుర్తించాలన్నారు.