E.G: గోకవరం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం మండలం కృష్ణుని పాలెం గోపికృష్ణ ఫంక్షన్ హాల్ ఆవరణలో గోకవరం పశు వైద్యశాల వైద్యులు డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం, గాలికుంటు వ్యాధి నిరోధిక టీకాలు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.