CTR: రాష్ట్ర వ్యాప్తంగా పలువురు SP లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో తూషార్ డూడీ జిల్లా SP గా బాధ్యతలు చేపట్టనున్నారు.