BHNG: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. సీఎం సానుకులంగా స్పందిచినట్లు వారు తెలిపారు.