JDWL: దరూర్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ 2004-05లో ఉప్పేర్ జడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి పూర్తి చేశాడు. ఇటీవల శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించగా, ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థుల బృందం శనివారం అతని కుటుంబాన్ని పరామర్శించారు. మిత్రులందరూ కలిసి రూ. 40,000 సేకరించి, ఆ మొత్తాన్ని శ్రీనివాస్ కుమార్తె దీపిక పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేశారు.