కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాలకు ఎస్పీలు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఏడు జిల్లాలకు కొత్త ఎస్పీలు రాగా మరో ఏడు జిల్లాలకు బదిలీలయ్యారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లాకు ఎస్పీగా విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అయినా అన్నమయ్య జిల్లాకు ఎస్పీగా పనిచేశారు.